కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయంలోనూ (Tollywood) హీరో కార్తికేయ (Kartikeya)కు నిరాశే ఎదురైంది. ఈయన తాజా సినిమా రాజా విక్రమార్క (Raja Vikramarka) బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి తారాజువ్వలా దూసుకొచ్చిన హీరో కార్తికేయ. ఆ సినిమా సాధించిన సంచలన విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు ఈ హీరో. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ ఆ స్థాయి విజయం కాదు కదా.. కనీసం మరో విజయం కూడా అందుకోలేకపోయాడు. గుణ 369, హిప్పీ, చావు కబురు చల్లగా లాంటి సినిమాలు వచ్చినా కూడా కార్తికేయ ఆశలను.. ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టలేక నిరాశ పరిచాయి.
కచ్చితంగా హిట్ కొట్టాల్సిన ఈ సమయంలో రాజా విక్రమార్కతో వచ్చాడు ఈ హీరో. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి కూడా యావరేజ్ టాక్ వచ్చింది. చిరంజీవి టైటిల్‌తో రావడంతో ముందు నుంచి కూడా దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. కొత్త దర్శకుడు..వినాయక్ దగ్గర శిష్యుడిగా పని చేసిన శ్రీ సిరిపల్లి ఈ సినిమాను తెరకెక్కించాడు. తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran) హీరోయిన్గా నటించింది. తమిళ సీనియర్ నటుడు పశుపతి ఇందులో విలన్‌గా నటించాడు.
కార్తికేయ గత సినిమా చావు కబురు చల్లగా కంటే తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. మంచి ప్రమోషన్స్ కూడా రాజా విక్రమార్కకు హెల్ప్ కాలేదు. ఈ సినిమాకు రూ.4.3 కోట్ల థియెట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వడానికి 4.5 కోట్లు షేర్ రావాలి. అయితే ఇప్పటి వరకు 4 రోజుల్లో సినిమా కేవలం 1.77 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇది డీసెంట్ ఓపెనింగ్స్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇది సరిపోదు.
మరో 2.70 కోట్లు షేర్ వస్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న సోసో టాక్ ప్రకారం చూస్తుంటే కార్తికేయ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కష్టమే. అంటే ఈ హీరోకు మరోసారి నిరాశ ఎదురైనట్లే. ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న వలిమై సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు కార్తికేయ. దాంతో పాటు హీరోగానూ రెండు సినిమాలు చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి