Riteish Deshmukh | బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘రాజా శివాజీ’ (Raja Shivaji) బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లతో మరాఠీ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ చిత్రం, రెండో రోజు స్వల్ప తగ్గుదలని నమోదు చేసినప్పటికీ ప్రస్తుతం నిలకడగా రాణిస్తోంది. దీంతో ఈ చిత్రం రెండు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 26.06 కోట్లు నమోదు చేసింది. ఈ సినిమా మరాఠీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా. హిందీలో ఇప్పుడిప్పుడే రాణిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు.
రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘సైరాట్’ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమ్మర్ ఎంటర్టైనర్గా వచ్చిన ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించేలా కనిపిస్తోంది.