Raja Saab 2 | రెబల్ స్టార్ ప్రభాస్ అరడజను సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా నటిస్తున్న ది రాజా సాబ్ టీజర్ ఈ రోజు విడుదలైంది.ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ కూడా మరింత జోష్ తీసుకొచ్చింది. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోగా, సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజ మహల్ చుట్టూ జరిగే కథ, హారర్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రేక్షకులకి మంచి మజాని అందించాయి. టీజర్లో ప్రభాస్ స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ అందించాయి. వీఎఫ్ఎక్స్, తమన్ బీజీఎం మాత్రం టాప్ నాచ్‌లో ఉంది. ఇక కెమెరా వర్క్ కూడా గ్రాండియర్‌గా ఉంది.
టీజర్‌తో రాజా సాబ్ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమా ఎవరి ఊహలకు అందదని మారుతి అన్నారు. ఈ మూవీ రన్ టైం, సీక్వెల్‌పై ప్రెస్ మీట్లో మాట్లాడారు.ఈ సినిమాకు సంబంధించి చాలా కంటెంట్ తీసేసిన మారుతి ఫైనల్‌గా మూడు గంటల పాటు సినిమాని రెడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. పాటలు బాలెన్స్. అవన్నీ కలిపితే మూడున్నర గంటలు గ్యారెంటీ. దాన్ని ఎంత ట్రిమ్ చేసినా మూడు గంటల లెక్క తేలుతుంది అని చెప్పుకొచ్చారు.
ఇక ది రాజా సాబ్ మూవీకి సీక్వెల్ ఏమైనా ఉంటుందా?’ అనే ప్రశ్నకి మారుతి స్పందించారు. పార్ట్ 2 కోసం బలవంతంగా స్టోరీని సాగదీసి రుద్దనని స్పష్టం చేశారు. ‘మూవీ పూర్తయ్యాక చూద్దాం. పార్ట్ 2 కోసం బలవంతంగా కథ సాగదీసి రుద్దను. దానిపై ఫుల్ క్లారిటీ మాకు ఉంది. నటీనటులకు 8 గంటల వర్క్ అనేది సాధారణం. కానీ ఈ మూవీ కోసం మేము 18 గంటలు వర్క్ చేశాం. అందుకే టీజర్ సహా ఇంత మంచి అవుట్ పుట్ వచ్చింది.’ అని చెప్పుకొచ్చారు. తమన్ అద్భుత మ్యూజిక్ అందిస్తున్నారు. అది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. హీరో ఎంట్రీ సాంగ్, ముగ్గురు హీరోయిన్స్‌తో మరో సాంగ్ అన్నీ డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని స్పష్టం చేశారు. ఓ అభిమానిగా నా హీరోను ఎలా చూపించాలనుకున్నానో అలానే చూపించా. ప్రభాస్ ప్రత్యేక కామెడీ టైమింగ్‌ను పాన్ ఇండియా స్థాయిలో చూపించాలనుకున్నాం. హారర్ కామెడీ జానర్‌కు డిఫరెంట్‌గా ఈ స్టోరీ ఉంటుంది. ప్రభాస్‌కు నాపై ఉన్న నమ్మకంతో ఈ తరహా కథ చేశాను అని మారుతి చెప్పుకొచ్చారు.