Raj Tarun | రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘దర్శకుడిగా కొంత సమయం తీసుకుని కసితో చేసిన సినిమా ఇది.
ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కంప్లీట్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్యభర్తలు, ప్రేమికులు ఎంత వరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం.రవికుమార్ చౌదరి మంచి సబ్జెక్ట్‌తో చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.