రాజ్‌తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రామ్ భజరంగ్’. సిమ్రత్ కౌర్, సత్నా టైటస్, ఛాయాదేవి, మానస రాధాకృష్ణన్ కథానాయికలు. సుధీర్‌రాజు దర్శకుడు. స్వాతి సుధీర్, డాక్టర్ రవిబాల నిర్మాతలు. చిత్రీకరణ దాదాపు పూర్తయిన ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘ఇందులో నేను డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తా. డైరెక్టర్ సుధీర్ చక్కని స్క్రిప్ట్ రాసుకున్నాడు.
త్వరలో రాబోతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. మంచి నిర్మాణ విలువలతో, ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కుతున్న సినిమా ఇదని మరో హీరో సందీప్ మాధవ్ చెప్పారు. ‘ఇది మంచి మాస్ కథ. మణిశర్మ సంగీతం, అజయన్ విన్సెంట్ కెమెరా వర్క్ సినిమాకు హైలైట్స్. రాజ్‌తరుణ్, సందీప్ మాధవ్ పోటీపడి నటించారు. త్వరలోనే టీజర్, ట్రైలర్ విడుదల కానున్నాయి.’ అని దర్శకుడు సుధీర్‌రాజు తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.