రాజ్ ధ్రువ ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘పీటర్’. సుకేష్ శెట్టి దర్శకుడు. రవి హిరేమత్, రాకేష్ హెగ్డే నిర్మాతలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందినట్టు టీజర్ చెబుతున్నది.
విజువల్స్, భయపెట్టేలా కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతం, కేరళ సంప్రదాయాలు, అందాలు ఈ టీజర్‌కి అదనపు ఆకర్షణ. జాన్వీ రాయల్, రవిక్షాశెట్టి, రామ్ నాదగౌడ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గురుప్రసాద్ నార్నాడ్, సంగీతం: రిత్విక్ మురళీధర్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.