ఈ ఏడాది రష్మిక మందన్నకు బాగా కలిసొచ్చింది. ఒక్క ‘సికందర్’ మినహా ఈ భామ నటించిన చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో స్త్రీ స్వేచ్ఛ, నిర్ణయాధికారం, ఆత్మాభిమానం వంటి అంశాలను చర్చించారు. నవతరం మహిళా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నతో మరో మహిళా ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఉన్నారని సమాచారం.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రష్మిక మందన్న కథ విని ఓకే చేసిందని, ఇది కూడా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తరహాలోనే లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు. సరైన నిర్మాత దొరికితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘మైసా’, హిందీలో ‘కాక్టెయిల్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.