సోషల్‌మీడియాలో రాజకీయ, సామాజికాంశాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు నటుడు రాహుల్ రామకృష్ణ. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ‘చితి చివరిదాంక..కేసీఆరే’ అంటూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ వెనక ఉద్దేశ్యమేమిటనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.
కేసీఆర్ అభిమానులు మాత్రం ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. గతంలో కూడా ఎక్స్ వేదికగా రాహుల్ రామకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, కేటీఆర్‌లను ట్యాగ్ చేస్తూ రాహుల్ రామకృష్ణ గతంలో చేసిన ట్వీట్లు సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.