తెలంగాణలో బతుకమ్మ పండుగ వేడుక ఎంత ఘనంగా జరుగుతూ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌరమ్మగా పూజిస్తుంటారు. బతుకమ్మ పండుగ కోసం కొందరు ప్రత్యేకమైన పాటలు కూడా రూపొందిస్తుంటారు.
ఈ సంవత్సరం బతుకమ్మ పాట మరింత ఆదరణ పొందనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి బతుకమ్మ పాటనుకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రూపొందించారు. ఈ పాట ప్రముఖ గాయని స్వరంతో రూపొందించగా, హైదరాబాద్ సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరిపారు. రాష్ట్రంలో 6 నుండి బతుకమ్మ పండగా ప్రారంభం కానుండగా, ఆ లోపే పాట విడుదల చేయనున్నట్టు సమాచారం. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ పాటని అనువదించనున్నట్టు టాక్.