Raghavendra Rao K | ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా హనుమాన్(Hanuman) పేరే వినిపిస్తుంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం చూసిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కే రాఘవేంద్రరావు సినిమాతో పాటు దర్శకుడు ప్రశాంత్, హీరో తేజ సజ్జాలపై ప్రశంసల వర్షం కురిపించాడు.
”సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ” కే రాఘవేంద్ర రావు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది.
ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు.
అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు pic.twitter.com/yA4LPuL5GF— Raghavendra Rao K (@Ragavendraraoba) January 14, 2024