శివ కంఠమనేని, నందితాశ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీమ్ మేగోటి దర్శకుడు. లైట్ హౌస్ సినీ మ్యూజిక్ సంస్థ నిర్మించింది. ఈ నెల 5న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రిమినాలజీ ఫ్రొఫెసర్‌గా శివ కంఠమనేని చక్కటి నటనను ప్రదర్శించారు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది’ అన్నారు. శివ కంఠమనేని మాట్లాడుతూ ‘నటుడిగా నన్ను కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. సందేశంతో కూడా మెప్పిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.