నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా రూపొందుతున్న సూపర్ నాచురల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బుల్లెట్ బండి’. లారెన్స్ తమ్ముడు ఎల్వీన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకుడు. కేతిరేసన్ నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో నాగచైతన్య ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. స్వర్గీయ నటుడు శ్రీహరి సతీమణి, నాటి నృత్యతార డిస్కోశాంతి.. 28ఏండ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా వెండితెరపై మెరవనున్నారు. చెన్నై, తేంకాసి, కేరళ తదితర అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. వైశాలీరాజ్, సునీల్, అరవింద్ ఆకాష్, కాలీ వెంకట్, రంగరాజ్ పాండే, ఆర్.సుందర్రాజన్, చామ్స్, శివ శరా, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ సింగ్, సంగీతం: సామ్ .సి.ఎస్.