Bullettu Bandi | రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’ (Bullettu Bandi). ఈ సినిమాకు ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రంతో లారెన్స్ సోదరుడు ఎల్విన్ వెండితెరకి పరిచయం అవుతున్నాడు. నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపాడు అక్కినేని నాగ చైతన్య. ఈ సినిమాలో లారెన్స్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా.. కథిరేశన్ ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.