రాఘవ లారెన్స్ కథానాయకుడిగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇది నటుడిగా లారెన్స్ 25వ చిత్రం కావడం విశేషం. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాత. భారీ యాక్షన్ అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనున్నదని, లారెన్స్ కెరీర్లో వైవిద్యమైన సినిమాగా ఇది నిలుస్తుందని, నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 2025 సమ్మర్లో సినిమాను విడుదల చేస్తామని రమేశ్‌వర్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై షాడో అవతార్‌లో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందనున్న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.