Hema Committee Report – Rajinikanth | మలయాళం సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై విచారణ జరపడానికి కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఇప్పటికే అగ్ర నటులతో పాటు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఇదిలావుంటే హేమ కమిటీ రిపోర్ట్‌పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అసలు హేమ కమిటీ రిపోర్ట్ అంటే ఏంటో తెలీదు క్షమించండి. దీనిపై తర్వాత మాట్లాడుతాను అంటూ వెల్లడించారు. అయితే రజనీకాంత్ తనకు తెలిదు అన్న విషయాన్ని మీడియా వక్రీకరించి చూపుతుంది. దీంతో ఈ విషయంపై తాజాగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ స్పందించింది.
జస్టిస్ హేమ రిపోర్ట్ గురించి రజనీకాంత్‌కు పూర్తిగా తెలియకపోవచ్చని, అతనికి తెలిసి ఉంటే, అతను దానిపై వ్యాఖ్యానించే అవకాశం ఉందని చెప్పుకోచ్చారు. దీంతో పాటు రజనీ సార్.. మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటూ రాధిక వెల్లడించింది. అలాగే అగ్ర నటులు ఈ విషయంపై స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది రాధిక. అగ్రనటుల మౌనం పరిశ్రమకు ఆందోళన కలిగించే విషయం. ఇది ప్రజలల్లో నెగిటివ్‌గా వెళ్లే అవకాశం ఉంది. పరిశ్రమలో వేధింపులకు గురైన మహిళలకు స్టార్ నటుల మాటలు ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. తమిళ అగ్ర నటుల్లో చాలా మందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని వారు తోటి నటీమణులకు మద్దతు ఇవ్వాలని రాధిక కోరారు.
Also Read..