Radhe Shyam | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కొద్ది గంటల క్రితం అమెరికాలోని పలు లొకేషన్లలో ఈ క్రేజీ మూవీకి టికెట్స్ బుక్ అయ్యాయి. ఏఎంసీ థియేటర్ చైన్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ అమ్ముడైన టికెట్స్ ద్వారా ఓ కొత్త విషయం తెలుస్తోంది. అది ఓవర్సీస్లో రాధే శ్యామ్ రన్ టైమ్ గురించి.
రాధే శ్యామ్ రన్ టైమ్ ను 2 గంటల 20 నిమిషాలుగా మేకర్స్ చెబుతున్నారు. ఇది తెలుగు, హిందీ వరకు మాత్రమే ఓవర్సీస్లో ఆ నిడివిని 2 గంటల 8 నిమిషాలకు తగ్గించారు. యూఎస్ టికెట్స్ పై ఇదే నిడివి పేర్కొన్నారు. పాటల్లేకుండా సినిమాలు చూడటం అక్కడి ప్రేక్షకులకు అలవాటు. దాంతో సినిమాలోని పాటలు తీసేసి ఓన్లీ టాకీ పార్ట్ చూపిస్తున్నారని అనుకోవచ్చు.
రాధే శ్యామ్‌లో మూడు పాటలున్నాయి. ఈ రాతలే, నగుమోము తారలే, సంచారి. ఇప్పటికే విడుదలైన ఈ మూడు లిరికల్ సాంగ్స్ కు మంచి వ్యూస్ వచ్చాయి. హిందీలో ఈ పాటలను రీషూట్ చేసినట్లు సమాచారం. తెలుగులో యధాతథంగా ఉంచుతున్నారు. ఓవర్సీస్లో ఈ మూడు పాటలు ఒక్కోటి 4 నిమిషాల నిడివి అనుకున్నా 12 నిమిషాలు తగ్గుతుంది. అందుకే యూఎస్ టికెట్స్ పై 2 గంటల 8 నిమిషాల రన్ టైమ్ చూపిస్తోందని అంటున్నారు. మార్చి 11న రాధే శ్యామ్ ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.