Radha Madhavam | టాలీవుడ్లో పల్లెటూరు కథలు ఎప్పుడూ హిట్ ఫార్ములాయే. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మెజారిటీ ప్రేమ కథలు విజయాలు సాధించాయి. ఆ జానర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మరో పల్లెటూరి ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. యువనటులు వినాయక్ దేశాయ్, అపర్ణా దేశాయ్ జంటగా రూపుదిద్దుకొంటున్న ప్రేమకథా చిత్రం ‘రాధామాధవం’ (Radha Madhavam). ఈ సినిమాకు దాసరి ఇస్సా దర్శకత్వం వహిస్తుండగా.. గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ట్రైలర్ బాగుందని మంచి పల్లెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్ కలిగించిందని వెల్లడించారు. ఇక ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు శ్రీకాంత్ చెప్పారు. ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర యునిట్ వెల్లడించింది.
The trailer of #RadhaMadhavam, launched by the ever-inspiring @actorsrikanth garu*, promises an epic tale of love 🎥🌟
Out now on @telugufilmnagar
▶️ https://t.co/qWGiQkz2V1@vinayakdes6229 @DasariEsha58399 @Aparnadeviii @ven97665venkat #GVKCreations #GonalVenkatesh… pic.twitter.com/9WOZXLzl9i
— BA Raju’s Team (@baraju_SuperHit) February 1, 2024