వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న ‘రాధా మాధవం’ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ ప్రేమకథా చిత్రమిది. హృద్యమైన కథాంశంతో ఆకట్టుకుంటుంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. చక్కటి సందేశాత్మక చిత్రమని సెన్సార్ వారు ప్రశంసించారు. ఈ ప్రేమకథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. మేక రామకృష్ణ, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తాజ్ జీడీకే, సంగీతం: చైతు కొల్లి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.