రచ్చరేపిన ఫస్ట్‌నైట్ కామెంట్స్

కన్నడ కథానాయిక రచితారామ్ ఫస్ట్‌నైట్ గురించి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు శాండిల్‌వుడ్‌లో తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఆమె మాటలు కర్ణాటక సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయంటూ అక్కడి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రచితారామ్ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కర్ణాటక క్రాంతిదళ్ సంస్థ డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రచితారామ్ కథానాయికగా నటిస్తున్న ‘లవ్ యూ రచ్చు’ చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశాన్ని గత వారం బెంగళూరులో నిర్వహించారు. ఇందులో సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు శృంగారభరితంగా ఉండటంతో..‘ఇలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం ఇబ్బందిగా అనిపించలేదా’ అంటూ ఓ విలేకరి రచితారామ్ను ప్రశ్నించారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం వివాదాస్పదమైంది. ‘ఇక్కడ చాలా మంది పళ్లైనవారే ఉన్నారు. పెళ్లి చేసుకున్నవారంతా చేసేది రొమాన్సేగా? మా సినిమాలో కూడా అదే చూపించాం. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే నేను ఇంటిమేట్ సీన్స్‌లో నటించా’ అంటూ రచితారామ్ చెప్పిన సమాధానం అక్కడున్న వారందరిని ఇబ్బందికి గురిచేసింది. మీడియా సమావేశంలోనే పాత్రికేయులు ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయగా..తాను ఎవరిని కించపరిచే ఉద్దేశ్యంతో ఆ మాటలు అనలేదని రచితారామ్ వివరణ ఇచ్చింది. అయితే ఈ వివాదం కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు చేరడంతో కొత్త మలుపు తీసుకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆమె మాటలు విరుద్ధంగా ఉన్నాయంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు తేజస్వీ నాగలింగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్న చిత్ర దర్శకనిర్మాతలు కథానాయిక రచితారామ్తో క్షమాపణలు చెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

