అప్సరా రాణి, వరుణ్‌సందేశ్, విజయ్‌శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. సురేష్ లంకలపల్లి దర్శకుడు. ఈశ్వర్ నిర్మాత. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. వందకోట్లతో తీసిన భారీ సినిమా తరహాలో మేకింగ్‌పరంగా అద్భుతంగా వచ్చిందని, రాయలసీమ నేపథ్యంలో ప్రతీకార కథగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశానని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తాయని హీరో విజయ్ శంకర్ అన్నారు. కొత్త కంటెంట్‌తో మంచి క్వాలిటీతో సినిమా తీశామని నిర్మాత ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.