Mohan Babu | మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్, మోహన్‌బాబు వద్ద ఉన్న లైసెన్స్ తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ జల్పల్లిలో మంగళవారం రాత్రి హైడ్రామా నడిచింది. ప్రైవేటు బౌన్సర్ల సాయంతో గేట్లు తోసుకుంటూ మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దౌర్జన్యానికి దిగారు. జర్నలిస్టుల చేతిలో ఉన్న మైకు లాక్కొని వారిపైనే దాడికి దిగాడు.
Pichhi Pichhi Veshalu Yesaro
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro#MohanBabupic.twitter.com/XlmMtvedbp— Milagro Movies (@MilagroMovies) December 10, 2024
కాగా, మోహన్‌బాబు దాడిలో జర్నలిస్టు రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చెవి, కంటికి మధ్య మూడు ఫ్యాక్చర్లు అయ్యాయని వైద్యులు గుర్తించారు. గైగోమాటిక ఎముక మూడు ప్రాంతాల్లో విరిగినట్లుగా నిర్ధారించారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మోహన్‌బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు జర్నలిస్టు రంజిత్ దాడిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన.. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.