Raashi Khanaa | దక్షిణాదికి చెందిన నటులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ కథానాయిక రాశి ఖన్నా. సౌత్ ఇండస్ట్రీలో అభిమానులు హీరోలను దేవుడిలాగా కొలుస్తారని ఒ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది. రాశీ ఖన్నా బాలీవుడ్లో చేస్తున్న తాజా చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report). 12 ఫెయిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న రాశీ తాజాగా సౌత్ ఇండస్ట్రీ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రాశీ మాట్లాడుతూ.. హీరోలకు సౌత్‌లో ఉన్నంతా పాపులారిటీ ప్రస్తుతం బాలీవుడ్లో లేదు. అక్కడ హీరోలని దేవుడి లాగా కొలుస్తారు అభిమానులు. వారి సినిమాలు విడుదల అయితే పండగా చేసుకుంటారు. ఒకప్పుడు ఇది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలకు కనిపించేది. కానీ ఇప్పుడు బాలీవుడ్లో అలా లేదు. కానీ సౌత్‌లో ప్రతి ఒక్క హీరోకి స్టార్డమ్ ఉంటుంది. నేను సౌత్‌లో చేసిన దర్శకులు ఇప్పటికి చెబుతూ ఉంటారు. అక్కడ పెద్ద హీరోల సినిమాలు విడుదల అయితే స్కూల్ బంక్ కొట్టి మరి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అని. జస్ట్ వారు అభిమానించే నటుడిని చూడడానికి మాత్రమే సినిమాలకు వెళుతుంటారు. అంత పిచ్చి సినిమాలంటే వాళ్లకి. ఏలాంటి సమస్య అయిన రానీ సినిమా చూడడం మాత్రం ఆపారు. కావాలంటే వేరే పనులను అయిన పెండింగ్ చేస్తారు ఏమో కానీ సినిమాలు చూడడం మాత్రం ఆపారు అంటూ రాశీ ఖన్నా చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.