రామ్‌కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన కుటుంబకథాచిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహదేవ్ గౌడ్, నాగరత్నం నిర్మాతలు. జనవరి 1న సినిమా విడుదల కానున్నది. సోమవారం ఓ ప్రకటన ద్వారా నిర్మాతలు ఈ విషయాన్ని తెలియజేశారు.
కొత్త ఏడాది అందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, నూతన సంవత్సర కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆలరించే కుటుంబకథా చిత్రమిదని మేకర్స్ తెలిపారు. డా.రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చరవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి, సంగీతం: మణిశర్మ.