లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో తమిళంలో విజయం సాధించిన ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రం తెలుగులో రానుంది. గురుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కే ఫిల్మ్స్ పతాకంపై ఆర్కే గౌడ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 29న విడుదలకానుంది. సోమవారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు ప్రముఖ నిర్మాణ ఏఎం రత్నం, సీనియర్ నటుడు సుమన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..నేటి మహిళలు మరింతగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాల్సిన అవసరం ఉందని, ఈ సినిమా వారికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. తాను నిర్మించిన ‘కర్తవ్యం’ సినిమా మహిళలు పోలీస్ శాఖలోకి రావడానికి ప్రేరణ నిచ్చిందని, అదే తరహాలో ఝాన్సీ ఐపీఎస్ ఆకట్టుకుంటుందని ఏఎం రత్నం పేర్కొన్నారు. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ నటన హైలైట్‌గా నిలుస్తుందని, ముఖ్యంగా పోరాటఘట్టాలు థ్రిల్‌ని పంచుతాయని, త్వరలో మహిళా కబడ్డీ జట్టు అనే సినిమా చేయబోతున్నామని నిర్మాత ఆర్కే గౌడ్ తెలిపారు.