Perfume Movie | టాలీవుడ్ యువ నటులు ప్రాచీ థాకర్, చేనాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పర్ఫ్యూమ్’ (Perfume). ఈ సినిమాకు జేడీ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. ఇక అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు. అతడు ఇలా ఎందుకు మారాడు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక సైకలాజికల్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Unique, Thrilling & Gripping
Theatrical trailer of the first Indian film with the concept of smelling obsession #Perfume dropped 💥 🔥
Get ready to experience a thrilling ride in cinemas#PerfumeReleasingOnNov24
Hit the 🔗
▶️ https://t.co/rtBKNd7DHS 🤩@NagNageshLavuri… pic.twitter.com/RtkNdhTRrJ— Ramesh Bala (@rameshlaus) November 20, 2023