Prashanth Varma | ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మరో సినిమా అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. పీవీసీయూ3 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ లేడి ఓరియెంటెడ్‌గా రాబోతున్నట్లు ఇందులో కాళి మాతాగా ప్రముఖ హీరోయిన్ ఇండియన్ సూపర్ వుమెన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా పేరు ఏమిటి, ఇందులో నటించే నటీనటులు ఎవరు అన్న విషయాలు గురువారం తెలియనుంది.
#PVCU3 – Female Super Hero pic.twitter.com/3G0Nbd5708
— Aakashavaani (@TheAakashavaani) October 9, 2024