Pv sindhu dance | మెగాస్టార్ చిరంజీవి పాటకు.. పీవీ సింధు స్టెప్పులు
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ పాటకు సింధు స్టెప్పులేయగా.. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
PV Sindhu | బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతో సత్తా చాటుతూ అనేక పథకాలను సాధించింది. దీంతో తెలంగాణే కాకుండా.. దేశం గర్వించే క్రీడకారిణిల్లో ఒకరిగా నిలిచింది. రియో ఒలింపిక్స్(2016 Rio de Janeiro)లో సిల్వర్, టోక్యో ఒలింపిక్స్(2020 Tokyo) లో బ్రౌంజ్ మెడల్స్ సాధించి తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. ఇలా తన ఖాతాలో ఎన్నో అవార్డులు, రికార్డులు వేసుకున్న పీవీ సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
అయితే పీవీ సింధు ఆటల్లోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్.. రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు తనకు నచ్చిన పాటలపై స్టెప్పులేస్తూ డ్యాన్స్ లోనూ అదరగొడుతోంది. తాజాగా పీవీ సింధు మెగాస్టార్ చిరంజీవి పాటకు స్టెప్పులేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోని బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ అనే పాట ఎంత హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకు పీవీ సింధు డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ లెహంగా డ్రెస్స్‌లో స్టైలిష్‌గా ఉన్న సింధు ఈ పాటకు స్టెప్పులేసి మరింత అందం తీసుకొచ్చింది. డ్యాన్స్ వీడియోను సింధు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 332,968 లక్షల మంది ఈ వీడియోను ఇష్టపడగా. . వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి.
గాయం నుంచి కోలుకున్న సింధు ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అడుతుంది. ఈ టోర్నీలో భారత్ యూఏఈ, మలేసియా, కజకిస్తాన్ లతో కలిసి గ్రూప్-బిలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

