సాయిపల్లవి తరహా పాత్రల్లో నటించాలని ఉంది.. పుష్పక విమానం హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pushpaka vimanam | ‘నాకు మీనాక్షి అనే పేరు చాలా ఇష్టం. కాలేజీలో కొందరు అలాగే పిలిచేవాళ్లు. ‘పుష్పక విమానం’ చిత్రంలో అదే పేరుతో నా పాత్రను పోషించడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది’ అని చెప్పింది గీత్ సైనీ ( Geet saini ). ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం కథానాయిక గీత్సైనీ పాత్రికేయులతో ముచ్చటిస్తూ చెప్పిన సంగతులివి..
సంప్రదాయ కుటుంబం నుంచి..
మహారాష్ట్ర నేపథ్యం ఉన్న కుటుంబం మాది. అయితే నాన్న ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగాం. పదేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే స్థిరపడటంతో తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నా. మాది సంప్రదాయక కుటుంబం కావడం వల్ల సినిమాల్ని కెరీర్‌గా ఎంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు నృత్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ బాగా చేసేదాన్ని. నా స్నేహితురాలు ఒకరు నా ప్రొఫైల్‌ను దర్శకుడికి పంపించడంతో ఈ సినిమా లో నటించే అవకాశం దక్కింది.
సాయిపల్లవి తరహాలో..
ఈ సినిమాలో నేను మీనాక్షి అనే పాత్రలో కనిపిస్తాను. సుందర్ అనే అబ్బాయిని పెళ్లిచేసుకున్న మీనాక్షి అనుకోకుండా అతన్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆమె అలా ఎందుకు చేసింది? దానికి కారణాలేమిటన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. నా పాత్రలో మంచి వినోదం కూడా ఉంటుంది. జంధ్యాల, రాజేంద్రప్రసాద్, నరేష్ సినిమాల్లోని కామెడీని బాగా ఇష్టపడతాను. కళాత్మక చిత్రాలంటే ప్రాణం. దర్శకుడు విశ్వనాథ్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాలన్నీ చూశాను. ‘స్వర్ణకమలం’ సినిమాలో భానుప్రియ పేరు మీనాక్షి. అదే పేరుతో నా పాత్ర ఉండటం గర్వంగా అనిపించింది. కెరీర్ గురించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. డ్యాన్స్ ప్రధానంగా సినిమాల్ని ఇష్టపడతాను. నాయికగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. సాయిపల్లవి తరహాలో సినిమాల్ని ఎంచుకోవాలని అనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగు పరిశ్రమ నుంచి అవకాశాలొస్తున్నాయి. ‘పుష్పక విమానం’ విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pushpaka vimanam | తెలంగాణ యాస ఉపయోగపడింది: శాన్వీ మేఘన
Vijaya Devarakonda: తమ్ముడిని విసిగించిన విజయ్.. నా పెళ్లాం లేచిపోయిందన్న ఆనంద్
ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది..పుష్పక విమానం ప్రమోషన్స్‌లో బాంబ్ పేల్చిన విజయ్‌దేవరకొండ..!!
అన్నయ్య చెప్పింది అదొక్కటే.. విజయ్ దేవరకొండపై ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

