Pushpa2 The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప2: ది రూల్’ (Pushpa2 The Rule) టికెట్ ధరల పెంపునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 04 రాత్రి నుంచి బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం వీటి ధరను రూ.800గా ఖరారు చేసింది. ఇక పెంచిన రేట్లను బట్టి బెన్ఫిట్ షో రేట్లను చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్‌లో రూ.1121గా.. మల్టీప్లెక్స్‌లో రూ.1239 గా ఉండనున్నాయి. అయితే సినిమా విడుదల అనంతరం డిసెంబర్ 5 నుంచి నుంచి 23 వరకు సాధరణ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది.
ఇక పెరిగిన రేట్లను బట్టి టికెట్ ధరలను చూసుకుంటే.. ఈ సినిమా విడుదలయిన నాలుగు రోజుల పాటు (డిసెంబర్ 05 నుంచి 08 వరకు) సింగిల్ స్క్రీన్‌లో రూ.354 గా ఉండబోతుండగా.. మల్టీప్లెక్స్‌లో దీని టికెట్ ధర రూ.531గా నిర్ణయించారు. ఇక నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేటర్లలో రూ.300గా.. మల్టీ ప్లెక్స్‌లో రూ.472 ఉండనుంది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేటర్లలో రూ.200.. మల్టీఫ్లెక్స్‌లో రూ.354గా నిర్ణయించారు. దీంతో ఈ సినిమా టికెట్ రేట్లు దాదాపు 20 రోజులకి కానీ తగ్గేలా లేవు.
అయితే మొదటి నాలుగు రోజులు ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.1380 అవ్వనుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో టికెట్ ధరలు మూవీపై ఎఫెక్ట్ పడనున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. మరోవైపు సినిమాకి ఉన్న హైప్ వలన చూస్తారు అని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది.