అల్లు అర్జున్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి పార్ట్ “పుష్ప : ది రైజ్” డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం “పుష్ప: రైజ్ ట్రైలర్” కట్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి.
విడుదలకు ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఈ గ్యాప్ లోనే చిత్రీకరణ పూర్తి చేయాలి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసి ప్రమోషన్స్ ముమ్మరం చేయాలి. పనులు అయితే శరవేగంగానే నడుస్తున్నట్టు తెలుస్తుండగా, డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.
ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. సమంత రూత్ ప్రభు ఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్ చేయబోతున్నారు.