Pushpa The Rule Trailer | భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 ట్రైలర్ రికార్డు వ్యూస్‌తో దుసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ వర్మతో పాటు, హారీశ్ శంకర్, రిషబ్ శెట్టి, అనిల్ రావిపూడి, రిషబ్ షెట్టి, మెహర్ రమేష్ తదితరులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
ఇదిలావుంటే ఈ మూవీ ట్రైలర్‌పై మెగా కాంపౌండ్ నుంచి ఒక్క పోస్ట్ కూడా రాకపోవడం విశేషం. దీంతో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఇంకా గొడవలు సద్దుమణిగినట్లు లేవని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభా ఎలక్షన్స్ సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా.. అల్లు అర్జున్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తన మావయ్య జనసేన పార్టీకి ఒకవైపు సపోర్ట్ చేస్తునే మరోవైపు శిల్పా రవికి మద్దతును ప్రకటించాడు బన్నీ. దీంతో ఈ వివాదం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య దూరాన్ని పెంచింది. దీంతో అప్పటినుంచి అల్లు అర్జున్ను ట్రోల్ చేస్తూ వస్తున్నారు మెగా అభిమానులు. పుష్ప చిత్రం ఆగష్టు 15 నుంచి వాయిదా పడడానికి ఇది కూడా ఒక కారణం. అయితే తాజాగా ఫుష్ప 2 ట్రైలర్ విడుదలయ్యాక మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా అల్లు అర్జున్ను ప్రశంసిస్తూ.. పోస్ట్ పెట్టలేదు. ప్రతి చిన్న సినిమాని ఎక్స్ వేదికగా ప్రశంసించే సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాపై స్పందించకపోవడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mega nundi okka appreciation tweet padale, kaanarani bayanni ayadu @alluarjun #PushpaTheRuleTrailer pic.twitter.com/ja4fepT4wo
— AitheyEnti (@Tweetagnito) November 17, 2024