Pushpa The Rule | డిసెంబర్ 05న విడుదలయ్యే పుష్ప 2 సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 6 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. అయితే ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ బుకింగ్స్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక డిఫరెంట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఉన్న హైప్ వలన టికెట్లను వేలం పద్దతి ద్వారా చిత్రయూనిట్ అమ్మబోతున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2 ఫస్ట్ డే ఫస్ట్ షోకి సంబంధించి తొలి టికెట్‌ను వేలం పద్దతి ద్వారా అమ్మబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వేలంలో ఎవరు ఎక్కువకు పాడుకొంటే.. వాళ్లదే ఫస్ట్ టికెట్ అన్నమాట. ఏపీ, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలో మొదటి టికెట్ వేలం ద్వారానే విక్రయించనున్నట్లు సమాచారం. ఇక ఈ వేలం ద్వారా టికెట్ దక్కించుకున్న వారి వివరాలను ఆన్లైన్ రూపంలో లేదా ఆఫ్‌లైన్ రూపంలో పొందుపరుచనున్నట్లు తెలుస్తుంది. కాగా.. ప్రస్తుతానికి ప్రతిపాదనలో ఉన్న ఈ ఆలోచనను మేకర్స్ ఒకే చేస్తారా లేదా అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది.