Pushpa 2 The Rule | మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్‌గా ‘పుష్ప 2 ది రూల్’ సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీమియర్స్‌తో పాటు విడుదల రోజుకి సంబంధించి థియేటర్ల్ అన్ని హౌజ్ ఫుల్ బోర్డ్‌లు పెట్టేశాయి. ఈరోజు రాత్రి 9.30 తర్వాత పుష్ప 2 ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. దీంతో ఇప్పటినుంచే అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ల ముందు సంబరాలు మొదలు పెట్టారు. దాదాపు 3 ఏండ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా థియేటర్లో విడుదల కానుడటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే నటుడు అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఏందులో సినిమా చూస్తున్నారు అనేదానికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది.
అల్లు అర్జున్‌తో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన వారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో ఈరోజు రాత్రి 9.30 గంటలకు సినిమా చూడబోతుండగా.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి నల్లగండ్లలోని అపర్ణలో రాత్రి 9.30 గంటల షోకి వెళ్లనున్నాడు. ఏషియన్ మహేశ్ బాబు థియేటర్లో మైత్రీ మేకర్స్ నిర్మాతలు చూడబోతుండగా.. దిల్ రాజు, అనిల్ రావిపూడి తదితరులు శ్రీరాములు థియేటర్లో సినిమా చూడనున్నట్లు సమాచారం. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు అతడి సన్నిహితులు అమీర్‌పేటలోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌లో చూడనున్నట్లు తెలుస్తుంది.