Pushpa The Rule Fans Show In Kerala | మరో నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప గాడి సందడి మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్కు సంబంధించి బుకింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తాజాగా అరుదైన రికార్డును క్రియేట్ చేయబోతుంది. చరిత్రలో మొట్టమొదటి సారి మహిళలకు ఫ్యాన్స్ షో వేయబోతున్నారు. అదికూడా ఒక తెలుగు హీరోకి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కేరళలో కావడం విశేషం. అవును పుష్ప సినిమాకు మహిళలకు ప్రత్యేక షో వేయబోతున్నట్లు అల్లు అర్జున్ కేరళ ఫ్యాన్స్ ప్రకటించారు. ఉదయం 7 గంటలకు ఈ షో ప్రదర్శించబోతున్నట్లు ఫ్యాన్స్ ప్రకటించారు. దీంతో ఏ హీరోకి లేని ఒక రికార్డును అల్లు అర్జున్ క్రియేట్ చేయబోతున్నాడు.
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
FIRST EVER GIRLS FANS SHOW FOR A TELUGU HERO IN KERALA !!#Pushpa2TheRule Girls Fans show charted on 7 am at Minerva Cinemas,Kottarakkara.@alluarjun Kerala Fans on a streak to make history ❤️🔥@e4echennai @iamRashmika @imsarathchandra pic.twitter.com/nAc1YTPreM
— Adopted Son Of Kerala (@ASOKERALA) November 6, 2024