Pushpa The Rule | ప్రస్తుతం ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా పుష్పగాడి రూల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన పుష్ప 2 ట్రైలర్ గురించే టాపిక్. అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ (Pushpa 2 Trailer) ఆదివారం బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్ వేదికగా విడుదలై యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా సృష్టించే రికార్డులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
కొందరు ఏమో ఈ సినిమాను టాలీవుడ్లో మరో రూ.1000 కోట్ల చిత్రం అవుతుందని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం రూ.1000 కాదు రూ.2000 కోట్లు అంటున్నారు. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలను బట్టి చూస్తే.. ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న అత్యధిక కలెక్షన్ చిత్రాలు దంగల్(రూ.2000 కోట్లు), బాహుబలి 2 (రూ.1800 కోట్లు) చిత్రాలను పుష్ప 2 చిత్రం ఈజీగా క్రాస్ చేస్తుందని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో సరికొత్త రికార్డును సృష్టించనున్నాడు. పుష్ప పార్ట్ 1 చిత్రం ఇండియా వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రంకు వచ్చిన పాపులారిటీ వలన ఇప్పుడు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.