Pushpa The Rule | డిసెంబర్ 05న విడుదలయ్యే పుష్ప 2 సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 6 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 చిత్రం వారం వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి కాలేదని అందుకే వారం సమయం తీసుకొని విడుదల చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ రూమర్స్‌పై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. పుష్ప 2 వాయిదా పడుతుంది అనే వార్తలకు చెక్ పెడుతూ.. మేకర్స్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను షేర్ చేసి ‘డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ చిత్రం డిసెంబర్ 05న రావడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మరోవైపు ఓవర్సీస్ కాలమానం ప్రకారం అమెరికాలో డిసెంబర్ 04నే విడుదల కానున్నట్లు సమాచారం.
DECEMBER 5th ~ #AssaluThaggedheLe 😎🔥🤙🏻 #RappaRappa 💥💥💥#Pushpa2TheRule pic.twitter.com/96IcsPoWfV
— Pushpa (@PushpaMovie) November 22, 2024