Pushpa trailer review | ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ రివ్యూ..‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నార్రా..ఫైర్’
టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య ‘పుష్ప: ది రైజ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది.

టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య ‘పుష్ప: ది రైజ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దీన్ని కట్ చేసారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఎంత ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందో అర్థమవుతుంది. పుష్ప ట్రైలర్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది. ఆ తర్వాత మధ్యలో చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ.. డైలాగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఆయన పుష్ప రాజ్ పాత్రకు ప్రాణం పోసారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ముఖ్యంగా సూపర్ పోలీస్ ఆఫీసర్‌తో డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్.
ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే చివరలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నార్రా..ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానీ.. డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ కానీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూరుస్తూ.. సంచలన దర్శకుడు సుకుమార్ (Sukumar), సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే పర్ ఫెక్ట్ మాస్ సినిమాగా పుష్ప వస్తుంది. దీనిపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది.
అలాగే ట్రైలర్లో బన్నీ, రష్మిక మధ్యే వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టి జోరు మీదున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా..రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. వాటిని నిలబెడుతూ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

