టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప..ది రైజ్ (Pushpa : The Rise). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కాగా..అన్ని భాషల్లో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. తొలిసారి డైరెక్టుగా హిందీ మార్కెట్‌పై కన్నేసిన బన్నీ ఈ సినిమాతో ఇప్పటివరకు రూ.55 కోట్లకుపైగా గ్రాస్ సాధించినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
పుష్ప ఎవరూ ఊహించని విధంగా ముందుగానే ఓటీటీలో రానుందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజా అప్డేట్ ప్రకారం పుష్ప జనవరి 7న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కానుందట. ఇదే రోజు ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉండగా..వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. మొత్తానికి ఆర్ఆర్ఆర్ క్రేజీ డేట్‌ను క్యాష్ చేసుకునేందుకు పుష్పరాజ్ రెడీ అవుతున్నట్టు వస్తున్న వార్తలపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకున్నా ఈ అప్ డేట్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు సినీ లవర్స్.
ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా..సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, ఫహద్ ఫాసిల్ కీ రోల్స్ పోషించారు.