Pushpa in Bollywood | హిందీలో రికార్డు కలెక్షన్స్ సాధిస్తున్న అల్లు అర్జున్..

Pushpa in Hindi | నిజంగానే అల్లు అర్జున్ బాలీవుడ్లో ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వైరస్ కారణంగా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి అంటూ ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. అయినా కూడా పుష్ప సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. కానీ హిందీలో మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది.

విడుదలైన 16వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. అంతేకాదు హిందీలో పుష్ప సినిమాకు హైయ్యస్ట్ సింగిల్ డే కలెక్షన్ కూడా ఇదే. ఇప్పటికే బాలీవుడ్లో అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప సినిమా. అక్కడ ఈ సినిమాకు రూ.56 కోట్లు వచ్చాయి. 75 కోట్ల దిశగా వేగంగా దూసుకుపోతుంది పుష్ప. ఇదే విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ చిత్రానికి హౌజ్ ఫుల్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఓవరాల్‌గా ఇప్పటికే పుష్ప సినిమాకు 300 కోట్ల గ్రాస్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ అద్భుతాలు చేసింది పుష్ప.. ఇంకా చేస్తూనే ఉంది కూడా. కేవలం తమిళం, హిందీలోనే పుష్ప సినిమాకు 80 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఫుల్ రన్లో సినిమా రూ.350 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

