Pushpa | అల్లుఅర్జున్ సినిమాకు అరుదైన గౌరవం.. మూవీ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు
Pushpa movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.
Pushpa movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో కనీస స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పోటీగా ’83’, ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ వంటి సినిమాలు పుష్ప ధాటికి వాటి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మొదట ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా.. బన్నీ తన యాక్టింగ్‌తో మళ్లీ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాడు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది.
సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ‘మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ‘పుష్ప’ గెలుచుకుంది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరెక్కిక్కిన ఈ చిత్రం సెకండ్ పార్ట్ పుష్ప-2 ను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో పుష్ప సెకండ్ పార్ట్‌ను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

