Pushpa 2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప2 అనే చిత్రం చేసి గ్లోబల్ స్టార్‌గా కూడా మారాడు. అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేటర్లోనే కాక త ఓటీటీలోనూ విడుదలై అక్కడ కూడా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా టీవీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
‘పుష్ప 2’ ఏప్రిల్ 13న సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమైది. టీవీలో టెలికాస్ట్ కావడం ఇదే తొలిసారి కాబట్టి పుష్ప 2 మూవీ రికార్డు టీఆర్పీలను సాధిస్తుందని అంటున్నారు. ‘పుష్ప 2’ గత డిసెంబర్లో ఒకేసారి వివిధ భాషల్లో రిలీజైంది. ఇప్పుడు టీవీ లో కూడా ఒకే రోజున వివిధ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఏప్రిల్ 13న, ‘పుష్ప 2’ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం తదితర భాషల్లో వివిధ ఛానెళ్లలో ప్రసారం కానుండగా, దీనికి సంబంధించి విపరీతమైన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది.
భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను రూల్ చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ స్మాల్ స్క్రీన్ రూల్ చేయడానికి రెడీ అయింది.’పుష్ప 2: ది రూల్’ సినిమా తెలుగు వెర్షన్ ని ‘స్టార్ మా’ ఛానల్ లో ప్రసారం కానుంది.’పుష్ప 2′ చిత్రాన్ని ‘స్టార్ మా’లో ఏప్రిల్ 13 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ మూవీకి బుల్లితెరపై కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో కొత్త సినిమాలన్నీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో.. టీవీలో టెలికాస్ట్ అయ్యే సినిమాలకు మంచి టీఆర్పీ రావడం లేదు.. మరి ఈ చిత్రం ఎంత సాధిస్తుందో చూడాలి.