Pushpa 2 Trailer | ప్రపంచవ్యాప్తంగా పుష్ప గాడి రూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 24 రోజులు మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని అటు బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను ఇస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే రష్మిక మందన్నా కొత్త పోస్టర్‌తో పాటు, శ్రీలీల పోస్టర్‌ను పంచుకున్న మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17(ఆదివారం)న సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పుష్ప నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤🔥
Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋
With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/nCFKC4kYA5
— Pushpa (@PushpaMovie) November 11, 2024