Pushpa 2 | మరో 33 రోజుల్లో పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను ఇస్తున్నారు మేకర్స్. దీపావళి పండగ సందర్భంగా రష్మిక, అల్లు అర్జున్ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నవంబర్ నెలలో సాలిడ్ అప్డేట్స్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో బ్లాస్టింగ్ ట్రైలర్‌తో పాటు సినిమా ప్రమోషన్ ఈవెంట్లు, సాంగ్స్ లాంటివి ఉండబోతున్నట్లు తెలిపింది. దీంతో పుష్ప 2 విడుదల అయ్యేవరకు నవంబర్ మొత్తం అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను ఖుషి చేయబోతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మేకర్స్ నిర్మిస్తుంది.
November is going to be ICONIC with #Pushpa2TheRule 💥💥
Blasting Trailer, Massive Events across the Nation, Chartbuster Songs and much more❤🔥 🤙
Stay hyped 🔥
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/4FYnwXFgCj
— Pushpa (@PushpaMovie) November 1, 2024