Pushpa 2 The Rule | టాలీవుడ్ నుంచి అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు మొత్తం బ్యానర్లతో నిండిపోయి ఉంటాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్‌లలో అయితే జనాలు పోటెత్తుతారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా ఒక అగ్ర కథానాయకుడి చిత్రం ప్రసాద్స్ మల్లీప్లెక్స్‌లో లేకపోవడం విశేషం. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. నేషనల్ అవార్డు అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే పుష్ప 2 ది రూల్. అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటించగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డిసెంబర్ 04 నుంచి ప్రీమియర్ షోలు పడుతుండగా.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది ఈ చిత్రం.
ఇదిలావుంటే.. ఇప్పటివరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఓపెన్ అవ్వలేదన్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులు నుంచి అభిమానులు కూడా ప్రసాద్స్‌లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ఎప్పుడూ బుకింగ్ చేద్దామా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం విశేషం. దీంతో మొట్టమొదటిసారి తెలుగు అగ్ర హీరో సినిమా విడుదల లేకపోవడంతో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మూగబోయినట్లు కనిపిస్తుంది. విడుదల ముందు రోజు నుంచే బ్యానర్లతో, రివ్యూవర్లతో సందడి చేసే ప్రసాద్స్ ఇప్పడు చడిచప్పుడు లేకుండా ఉంది.
దీనికి కారణం ఏంటి అని చూస్తే.. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యంకు.. ‘పుష్ప 2’ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కి ఇంకా డీల్ కుదరట్లేదు అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రసాద్ నుంచి ఎక్కువ షేర్ మైత్రి అడిగినట్లు సమాచారం. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్‌కి సంబంధించి 55% డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వడానికి పీవీఆర్‌తో పాటు సినీపోలీస్, ఏషియన్ సినిమాలు అంగీకరించాయి. అయితే ప్రసాద్స్ నుంచి అదే కోరడంతో ప్రసాద్ యాజమాన్యం 52% మాత్రమే షేర్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మైత్రి మేకర్స్ వాళ్లు ఆ 3 % కూడా ఇవ్వాలని పట్టుబట్టడంతో ప్రసాద్స్ అంగీకరించడం లేదు. ఒకవేళ ఈ పర్సంటేజ్ని పెంచితే ప్రతి సినిమాకి ఇలానే ఇవ్వాల్సి ఉంటుందని ప్రసాద్స్ ఆలోచించినట్లు సమాచారం. కాగా.. ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.
#Pushpa2TheRule Not releasing in Prasad Multiplex Hyderabad ❌
Bad decision by both side, just for 3% extra share.Will impact 50-60 lakh in collection on day1 itself .@ursmohan_kumar #prasadmultiplex #AlluArjun #Pushpa2 pic.twitter.com/4AWxeKrcGH
— Parthik (@parthikpatell) December 4, 2024
#Pushpa2ThaRule is not releasing today at Prasad Multiplex, leading to losses for both the producers and the theatre owners. Hoping the issues are resolved soon.#AlluArjun #Pushpa2 #RashmikaMandanna #Sreeleela #Sukumar #DSP pic.twitter.com/J1a7Z9Fema
— 𝐌𝐔𝐋𝐓𝐈 𝐓𝐈𝐃𝐈𝐍𝐆𝐒 (@MULTITIDINGS) December 5, 2024