Pushpa 2 The Rule Breaks The Record | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్(Jawan) పేరిటా ఉన్న రికార్డును బద్దలుకొట్టిన విషయం తెలిసిందే.
హిందీలో జవాన్ సినిమా ఫస్ట్ డే రూ.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. ఫస్ట్ రోజు ఆ రికార్డును అధిగమించాడు అల్లు అర్జున్. మొదటి రోజు రూ.72 కోట్ల కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మూడో రోజు ఏకంగా రూ.74 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో మొదటి రోజు సాధించిన రూ.72 కోట్ల కలెక్షన్లు అధిగమించి తన రికార్డును తానే తిరగరాశాడు. దీంతో హిందీలో మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.205 కోట్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12000 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
IT’S A TSUNAMI – HURRICANE – TYPHOON… ‘PUSHPA 2’ REWRITES HISTORY *ONCE AGAIN*… #Pushpa2 emerges as a BOXOFFICE DINOSAUR, smashing every record that stands tall in the record books… The Saturday numbers prove it.#Pushpa2 is the first #Hindi film to surpass the ₹ 70 cr… pic.twitter.com/lufoMo9VO8
— taran adarsh (@taran_adarsh) December 8, 2024