Pushpa 2 The Rule Breaks The Record | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా మొదటిరోజే హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్(Jawan) పేరిటా ఉన్న రికార్డును బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. హిందీలో జవాన్ సినిమా ఫస్ట్ డే రూ.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. ఫస్ట్ రోజు ఆ రికార్డును అధిగమించాడు అల్లు అర్జున్.
మొదటి రోజు రూ.72 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు అయితే ఏకంగా రూ.74 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో మొదటి రోజున సాధించిన రూ.72 కోట్ల కలెక్షన్లు అధిగమించి తన రికార్డును తానే తిరగరాశాడు అల్లు అర్జున్. అయితే ఆదివారం కూడా ఈ రికార్డులు బద్దలయ్యింది. ఆదివారం రోజున ఏకంగా రూ.86 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించాడు పుష్పరాజ్. దీంతో నాలుగు రోజుల్లోనే బాలీవుడ్లో రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించాడు.
A HISTORIC DAY in Indian Cinema. A record breaking day in Hindi ❤🔥#Pushpa2TheRule collected a Nett of 86 CRORES on Sunday creating an all time record of the HIGHEST Hindi collection in a single day 🔥
RULING IN CINEMAS.
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt… pic.twitter.com/kDyCUNGWob— Mythri Movie Makers (@MythriOfficial) December 9, 2024