Mallu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ముంబైలో ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ది రూల్. బ్లాక్ బస్టర్ చిత్రం పుష్పకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 05 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా 06 రోజులు కూడా లేకపోవడంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ట్రైలర్ లాంఛ్ వేడుకను బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించగా.. ఈ ఈవెంట్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. సుమారు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకకు అల్లు అర్జున్‌తో పాటు రష్మిక, నిర్మాతలు రవి శంకర్, నవీన్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ మాట్లాడిన అనంతరం చివరిగా రష్మికతో కలిసి పుష్ప 2లోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే పాటకు స్టెప్పులేశాడు. ఇద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The moment of the evening 😍
Pushpa Raj and Srivalli dance for the #Angaaron song at the #Pushpa2IconicPressMeet 🫶Watch the event live here!
▶️ https://t.co/Pk4R18O17V#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/KlCqhW3z2M
— Pushpa (@PushpaMovie) November 29, 2024