‘పుష్ప-2’ సినిమా విషయంలో వినిపిస్తున్న నెగిటివ్ వార్తల్లో నిజం లేదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ప్రకటించింది. వివరాల్లోకెళ్తే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు సుకుమార్ పనితీరుపై అల్లు అర్జున్ అసంతృప్తితో ఉన్నారని, సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని, ‘పుష్ప’ పాత్ర కోసం పెంచిన గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసుకున్నది కూడా ఇందుకేనని పలు కథనాలు వెబ్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటిని చిత్రబృందం ఖండించింది.
‘పుష్ప-2’ విషయంలో అలాంటి వాటికి ఏమాత్రం తావు లేదని, సుకుమార్ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని, అనుకున్నట్టే డిసెంబర్6న ‘పుష్ప-2’ ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. ఇదిలావుంటే.. ఈ నెల 25 నుంచి ‘పుష్ప -2’ కొత్త షెడ్యూల్ మొదలు కానున్నదట. ఈ నెల 28 నుంచి బన్నీ షూటింగ్లో పాల్గొంటారని, ఈ షెడ్యూల్లోనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.