అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2’డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారపర్వాన్ని వేగవంతం చేశారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్రీలీలపై చిత్రీకరించిన ‘కిస్సిక్..’ అనే ప్రత్యేకగీతాన్ని ఈ నెల 24న చెన్నైలో జరిగే ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం పాట తాలూకు స్టిల్‌ను విడుదల చేశారు.