Sreeleela | ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావ..’ పాట ఎంతటి హిట్ అయ్యిందో తెలిసిందే. ఒక్క పాటతో హీరోయిన్ స్థాయి క్రెడిబులిటీని కొట్టేసింది అందాల సమంత. త్వరలో ‘పుష్ప 2’ రాబోతున్నది. ఆనవాయితీ ప్రకారం తొలి పార్ట్‌లో ఉన్నట్టే ఈ మలి పార్ట్‌లోనూ ఓ ఐటమ్ నంబర్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చెయ్యడం కామన్. దాన్ని గ్రహించే ‘పుష్ప 2’లో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్‌ని ప్లాన్ చేశారు దర్శకుడు సుకుమార్. మరి ఈ సారి బన్నీతో అడుగు కలిపే తార ఎవరు? అనే విషయంపై ఇన్నాళ్లూ అటు మీడియాలో, ఇటు పరిశ్రమలో తర్జనభర్జనలు జరిగాయి.
ఎట్టకేలకు ఈ పాటలో శ్రీలీల కనిపించనున్నట్టు తేటతెల్లమైపోయింది. రీసెంట్గా ‘పుష్ప2’ సెట్లో అల్లు అర్జున్, శ్రీలీల ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దాంతో మైత్రీ మూవీమేకర్స్ వారు అధికారికంగా ఆ పాట వివరాలను శనివారం ఎక్స్(ట్విటర్) ద్వా రా తెలియజేశారు. ఇందులో ‘కిస్సిక్..’ అంటూ సాగే ఐటమ్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని వారు ఈ పోస్ట్‌లో వెల్లడించారు. గతంలో ‘ఆహా’ ఓటీటీకి సంబంధించిన ప్రకటనలో బన్నీ, శ్రీలీల కలిసి నటించారు. ఇప్పుడు ‘పుష్ప2’ కోసం మరోసారి ఇద్దరూ కలిసి నర్తించనున్నారు. ఇది బన్నీ ఫ్యాన్స్‌కు నిజం గా శుభవార్తే.